Header Banner

'సత్యం సుందరం' డైరెక్టర్‌కు సూర్య, కార్తీ గిఫ్ట్! కానుక వెనుక కదిలించే కథ!

  Sun May 11, 2025 22:22        Entertainment

కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తి మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. '96' సినిమాతో ప్రఖ్యాతి పొందిన దర్శకుడు ప్రేమ్‌కుమార్‌కు ఆయన కలల కారు అయిన మహీంద్రా థార్‌ను బహుమతిగా అందించి ఆశ్చర్యపరిచారు. ఈ అనూహ్య కానుకతో దర్శకుడు ప్రేమ్‌కుమార్‌ ఆనందంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే, కార్తి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన 'మెయ్యళగన్' (తెలుగులో 'సత్యం సుందరం') చిత్రానికి ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రానికి సూర్య, జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా నిర్మాణం నుంచే సూర్య, కార్తిలకు ప్రేమ్‌కుమార్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే, ప్రేమ్‌కుమార్‌కు ఎంతో ఇష్టమైన మహీంద్రా థార్ కారును సూర్య కొనుగోలు చేసి, సోదరుడు కార్తి చేతుల మీదుగా ప్రేమ్‌కుమార్‌కు అందజేశారు. ఈ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌పై ప్రేమ్‌కుమార్‌ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "మహీంద్రా థార్ నా కలల వాహనం.

 

ఇది కూడా చదవండి: ఐరాసలో పాక్‌ను ఎండగట్టనున్న భారత్! దానిని రక్షించేందుకు పాక్ యత్నం!

 

ముఖ్యంగా తెలుపు రంగు Roxx AX 5L, 5-డోర్ వెర్షన్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. మార్కెట్‌లోకి రాగానే, నేను దాచుకున్న డబ్బుతో కొనాలనుకున్నాను. అయితే, బుక్ చేస్తే ఏడాది ఆగాలని తెలియడం, ఆ తర్వాత నా దగ్గరున్న డబ్బు ఖర్చుకావడంతో నా కలను పక్కనపెట్టేశాను" అని తెలిపారు. ఆయన ఇంకా కొనసాగిస్తూ, "ఇటీవల సూర్య అన్న నుంచి నాకిష్టమైన కారు ఫొటోతో పాటు 'కారు వచ్చేసింది' అని సందేశం వచ్చింది. మొదట ఏం అర్థం కాలేదు. ఫొటో చూసి ఆశ్చర్యపోయాను. సూర్య అన్న నాకోసం ఈ కారును కొని బహుమతిగా ఇచ్చారు. కార్తి అన్న చేతుల మీదుగా తాళాలు అందుకున్నాను. దీన్ని కేవలం బహుమతిగా కాకుండా, ఒక అన్న తన తమ్ముడి కలను నెరవేర్చినట్టుగా భావిస్తున్నాను" అంటూ సూర్య, కార్తిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. 

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli